సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ, సామాజిక అంశాలతో నిత్యం సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. తనకు నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు.. లేదంటే ఘాటుగా విమర్శనాస్త్రాలు సందిస్తుంటారు . లేటెస్ట్ గా ఆయన పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చేసిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తూ.. తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మమతాపై ఆర్జీవీ ఫైర్!
లేటెస్ట్ గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అనూహ్య ఓటమిని చవిచూసింది. బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. కమల దళం అధికారం చేపట్టేందుకు రెడీ అయింది. అయితే మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదిలేదంటూ మొండికేశారు. ఈ పరిణామంపై ఆర్జీవీ తీవ్రంగా స్పందించారు.
దశాబ్దాల రాజకీయ అనుభవం, 15 ఏళ్లపాటు సీఎంగా ఉన్న మమతా బెనర్జీ.. ప్రజాస్వామ్య మూలసూత్రాలను విస్మరించడం ఆశ్చర్యంగా ఉందంటూ ఆర్జీవీ పోస్ట్ చేశారు. వ్యవస్థలపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అని ఎక్స్ వేదికగా విమర్శించారు. మరోవైపు, బీజేపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ మమత తన మొండితనాన్ని సమర్థించుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
After so many DECADES in POLITICIS and 15 years as C M , I can’t believe that @MamataOfficial is ignoring that DEMOCRACY by it’s very DNA is about INSTITUTIONS and attacking them amounts to attacking DEMOCRACY
— Ram Gopal Varma (@RGVzoomin) May 6, 2026
విజయ్ 'ఐకానిక్' ఫోటోతో ..
ఇక తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకాన్ని ఆరంభించిన దళపతి విజయ్ విజయయాత్రపై వర్మ ఒక అరుదైన ఫోటోను షేర్ చేశారు. అది ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సుమారు 30 ఏళ్ల క్రితం నాటి ఒక బహిరంగ సభ ఫోటో అది. అప్పటి తమిళనాడు దిగ్గజ నేత ఎం. కరుణానిధి వెనుక.. కేవలం 16 ఏళ్ల వయసున్న విజయ్ నిలబడి ఉన్నారు. అప్పుడు ఆ దిగ్గజ నేత వెనుక నిలబడిన ఆ కుర్రాడు, భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాన్ని మారుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు అంటూ వర్మ రాసుకొచ్చారు.
►ALSO READ | తెలుగు చిత్ర పరిశ్రమలో నకిలీ దందా.. ఆ సంఘాలకు గుర్తింపు లేదన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్!
దళపతి క్రేజ్ వైరల్..
ఈ ఫోటో చూసిన విజయ్ అభిమానులు సినీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వ్యక్తి, ఈరోజు తమిళ రాజకీయాల్లో మెయిన్ ఫ్రేమ్‌లోకి రావడం "లైఫ్ ఈజ్ అన్‌ప్రిడిక్టబుల్" అనేదానికి నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) స్థాపించిన తర్వాత, ఆయన సాధిస్తున్న విజయాలు చూస్తుంటే.. ఆర్జీవీ చెప్పినట్టుగా ఆ ఫోటో నిజంగానే ఒక 'ఐకానిక్ మూమెంట్' అని చెప్పక తప్పదు అంటున్నారు. మొత్తానికి బెంగాల్ రాజకీయాలను విమర్శిస్తూనే, విజయ్ ఎదుగుదలను కొనియాడిన ఆర్జీవీ పోస్ట్‌లు ఇప్పుడు హాట్ టాపిక్ మారాయి..
Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party 🙏👍🔥 pic.twitter.com/7NNp6Ge73S
— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2026
