SRH vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్... పాత ఫార్ములానే నమ్ముకున్న శ్రేయస్..!

SRH vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్... పాత ఫార్ములానే నమ్ముకున్న శ్రేయస్..!

ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం ( మే 6 ) సన్ రైజర్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో 7:30 నిమిషాలకు ప్రారంభం కానుంది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగ్ కి దిగింది. ఇరు జట్లు ప్లే ఆఫ్ వేటలో ఉన్న క్రమంలో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. 

బలమైన బ్యాటింగ్ లైనప్ తో ఉన్న సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ కి దిగుతున్న క్రమంలో పంజాబ్ ముందు భారీ టార్గెట్ ఉంచడం ఖాయమే అనిపిస్తున్నప్పటికీ...  సన్ రైజర్స్ పంజాబ్ మధ్య జరిగిన గత మ్యాచ్ లో కూడా శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ కి దిగి సన్ రైజర్స్ ను ఓడించాడు. ఇప్పుడు కూడా శ్రేయస్ అదే ఫార్ములాతో బరిలో దిగడంతో ఈ మ్యాచ్ రిజల్ట్ పై ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉండగా ఈ సీజన్ లో 10 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచుల్లో గెలుపొందిన సన్ రైజర్స్ 12 పాయింట్లతో టేబుల్ లో మూడో స్థానంలో ఉంది. 9 మ్యాచులు ఆడిన పంజాబ్ 6 మ్యాచుల్లో గెలుపొంది 13 పాయింట్లతో టేబుల్ లో టాప్ పొజిషన్ లో ఉంది.
 

పంజాబ్ సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI: 

ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్ ), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయర్(కెప్టెన్ ), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, మార్కస్ జాన్సన్, లాకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: 

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్( వికెట్ కీపర్ ), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్( కెప్టెన్ ), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, షకిబ్ హుస్సేన్