ధోనీ, జాదవ్‌ నిరాశపర్చారు: సచిన్‌

ధోనీ, జాదవ్‌ నిరాశపర్చారు: సచిన్‌

సౌతాంప్టన్‌‌: అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ లో టీమిండియా మిడిలార్డర్‌ వైఫల్యం నిరాశకు గురి చేసిందని బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు.ముఖ్యం గా ధోనీ, కేదార్‌ ఆట విసుగు తెప్పించిందని విమర్శించాడు. ‘ఈ మ్యాచ్‌ లో ఇంకా మెరుగ్గా ఆడొచ్చు. కేదార్‌ , ధోనీ పార్ట్‌‌నర్‌ షిప్‌ బాగా లేదు. చాలా స్లో గా ఆడారు. 34 ఓవర్లు స్పిన్‌ ఆడి కేవలం119 పరుగులే చేశాం. ఇది ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే మనం ఎలాగైనా ఆడేది ఒక్క స్పిన్‌ లోనే. ఇందులోనూ సానుకూలంగా ఆడకపోతే ఎలా? ప్రతి ఓవర్‌ లో 2, 3 డాట్‌ బాల్స్‌ పడ్డా యి. విరాట్‌ ఔటైన 38వ ఓవర్‌ నుంచి 45 వరకు మనం పెద్దగా స్కోరు చేయలేకపోయాం’ అని మాస్టర్‌ పేర్కొన్నా డు.ఈ మ్యాచ్‌ లో కోహ్లీ కెప్టెన్సీ ఆకట్టుకుందని సచిన్‌ వెల్లడిం చాడు. కీలక సమయంలో బుమ్రా, హార్దిక్‌‌తో డాట్‌ బాల్స్‌ వేయించి ఫలితాన్ని రాబట్టాడని కితాబిచ్చాడు. ఫీల్డింగ్‌ కూడా బాగా సెట్‌ చేశాడని ప్రశంసించాడు. త్వరలోనే షమీకి మంచి టైమ్‌ వస్తుందని ముందే చెప్పా నని సచిన్​ అన్నాడు.