గవర్నర్ను బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతికి డీఎంకే మెమోరాండం

గవర్నర్ను బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతికి డీఎంకే మెమోరాండం

తమిళనాడులో గవర్నర్, డీఎంకే ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది.గవర్నర్ రవిని బర్తరఫ్ చేయాలని డీఎంకే డిమాండ్ చేస్తుంది. బీజేపీ ఏజెంట్‌లా గవర్నర్‌  వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఆయన్ను వెంటనే బర్తరఫ్‌ చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మెమోరాండం సమర్పించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. తమిళనాడులో 20 బిల్లులు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉందని స్పష్టం చేసింది.

గవర్నర్ ను రాష్ట్రపతి నియమించవచ్చు..తొలగించవచ్చు అని చట్టం చెబుతోందని డీఎంకే తెలిపింది. తమిళనాడు, కేరళ, తెలంగాణ గవర్నర్లు కేంద్రానికి తోలుబొమ్మల్లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించింది. గవర్నర్‌ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా.. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ డీఎంకే ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.