900 కోట్ల ఫ్రాడ్ : హైకోర్టును ఆశ్రయించిన సాహితి ఇన్ఫ్రా

900 కోట్ల ఫ్రాడ్ : హైకోర్టును ఆశ్రయించిన సాహితి ఇన్ఫ్రా

ఫ్రీ లాంచ్ పేరుతో కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు దోచుకున్న కేసులో సాహితి ఇన్ఫ్రా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. సాహితి ఇన్ఫ్రాపై బాధితులు విడివిడిగా ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని సైబర్ క్రైమ్  పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. అయితే అన్ని పిటిషన్లను ఓకే కేసుగా పరిగణించాలని సాహితి ఇన్ఫ్రా డివిజన్ బెంచ్లో పిటిషన్ వేసింది. సింగిల్ బెంచ్ తమ వాదనలను పరిగణలోకి తీసుకోలేదని ఆ సంస్థ తరపు న్యాయవాది డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు సాహితి ఇన్ఫ్రాపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 42 కేసులు నమోదయ్యాయి. అయితే కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలన్న హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.