సాహో పోస్టర్ కాపీనా..?

సాహో పోస్టర్ కాపీనా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఆగస్టు-30న ప్రేక్షకులముందుకు రానుంది. అయితే గురువారం రిలీజైన పోస్టర్ ని కాపీ కొట్టారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతన్నాయి.

ప్రభాస్, శ్రద్ధా కపూర్ శత్రువులతో గన్ ఫైట్ చేస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్… సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో స్పష్టం చేస్తోంది. దీన్ని శ్రద్ధా కపూర్ తన ఇన్‌ స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేస్తూ… ‘గతంలో ఎన్నడూ చూడని ఉత్కంఠ రేపే యాక్షన్ సన్నివేశాలతో ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’ ఈ ఆగస్టు 30 మీ ముందుకు రాబోతోంది’ అంటూ క్యాప్షన్ పెట్టింది.

అయితే ఈ పోస్టర్ చూసిన చాలా మంది నెటిజన్లు… ఇది ఆన్ లైన్ వీడియోగేమ్ టామ్ క్లాన్సీస్ రెయిన్ బో సిక్స్ సీజ్ పోస్టర్‌ ను పోలి ఉందంటున్నారు. అయితే దీన్ని మరీ అంత బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని ప్రభాస్ ఫ్యాన్ చెబుతున్నారు. మరి చూడాలి ఈ సీన్ సినిమాలో ఉంటుందా లేదా పీకేస్తారో..! యూవీ క్రియేషన్స్ రూ.300 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి.