టాక్ షోలో సాయిపల్లవికి రానా కాల్.. టెన్షన్ పడ్డ చైతూ.. అసలేం అడిగాడంటే..

టాలీవుడ్ హీరోల టాక్ షోలు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే తెలుగులో రానా దగ్గుబాటి ఇటీవలే  "ది రానా దగ్గుబాటి షో" పేరుతో టాక్ షో ప్రారంభించాడు. ఈ షోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ షోలో భాగంగా ఈసారి రానా ప్రముఖ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్యని తీసుకొచ్చి సందడి చేశాడు.

ఈ క్రమంలో వీరిద్దరితో కలసి నటించిన మలయాళ హీరోయిన్ సాయిపల్లవి గురించి టాపిక్ వచ్చింది. దీంతో నాగచైతన్య మాట్లాడుతూ సాయి పల్లవితో నటించాలంటే టెన్షన్ గ ఉంటుందని అన్నాడు. అలాగే సాయిపల్లవి యాక్టింగ్, డ్యాన్స్ స్కిల్స్ అమేజింగ్ అని కితాబు ఇచ్చాడు. సాయిపల్లవి పక్కన నటించాలంటే కొంతమేర టెన్షన్ గా ఉంటుందని సరదాగా నవ్వాడు. ఆ తర్వాత రానా సాయిపల్లవి కలసి నటించిన విరాటపర్వం సినిమాని గుర్తుచేస్తూ ఈ సినిమాలో ఒక్క సాంగ్ కూడా సాయిపల్లవితో చెయ్యకుండా బాగానే ఎస్కెప్ అయ్యావంటూ రానా ని ఆట పట్టించాడు.  

తర్వాత రానా సాయిపల్లవికి ఫోన్ చేసి మాట్లాడాడు. ఇందులో మీరు రియల్ లైఫ్ లో కూడా ఇంత మంచిగా ఉంటారా..? లేక ఫేక్ గా ఉంటారా.? అని  అడిగాడు. దీంతో నాగచైతన్య వెంటనే కలగజేసుకుని అసలు సాయిపల్లవికి ఫేక్ అంటే ఏంటో కూడా తెలియదని అన్నాడు. అలాగే త్వరలోనే సాయిపల్లవితో కలసి సాంగ్ షూట్ చెయ్యాల్సి ఉందని కాబట్టి ఆమెతో కొంచెం ఎక్స్ట్రా నైస్ గా ఉండాలని చెప్పుకొచ్చాడు. 

Also Read :- అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్.. రెండు రోజుల్లోనే రూ.వందల కోట్ల కలెక్షన్స్

ఇక సాయిపల్లవి నాగ చైతన్య గురించి మాట్లాడుతూ చైతూ చాలా కూల్ గా ఉంటాడని అలాగే ఎంత కోపం వచ్చినా కూల్ గా సమాధానాలు ఇస్తాడని అస్సలు కోప్పడడని చెప్పుకొచ్చింది. ఇక రానా మాట్లాడుతూ సెట్స్ లో ఎడిటింగ్ రూమ్ లో అందర్నీ టార్చర్ చేస్తున్నావంట.? అని అడగ్గా అదేమీలేదని తనని సజెషన్స్ అడిగితే ఆడియన్ గా చెబుతానని తెలిపింది. ఈ కాన్వర్సేషన్ సరదాగా ఉండటంతో  ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫుల్ ఎపిసోడ్ ప్రముఖ ఓటిటి అయిన అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది.

ఈ విషయం ఇలాఉండగా నాగచైతన్య, సాయిపల్లవి కలసి తండేల్ సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి టాలీవుడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన బుజ్జితల్లి సాంగ్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.