Sai Pallavi : అమీర్ ఖాన్ కొడుకుతో సాయి పల్లవి

Sai Pallavi : అమీర్ ఖాన్ కొడుకుతో సాయి పల్లవి

సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవి (Sai Pallavi)కి సపరేట్ క్రేజ్ ఉంది. గ్లామర్ డోస్ ఇవ్వకుండా తన సహజ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కేవలం సినిమాల్లోనే కాదు బయట ఆమె నడుచుకునే తీరు ఎంతోమందికి నచ్చుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ కేరళ కుట్టి అజాత శత్రువనే చెప్పాలి. చాలా సింపుల్గా ఉంటూ ఇప్పటివరకు తనపై ఎలాంటి విమర్శలు లేకుండా ఇండస్ట్రీలో కొనసాగుతుంది.

సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.లవ్ స్టోరీ నేపథ్యంలో బాలీవుడ్లో ఓ సినిమా చేస్తుంది. అందుకు ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడబోతోంది సాయి పల్లవి. అతనెవరో కాదు..బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్(Amir khan) కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan). ఈ మూవీని సునీల్‌పాండే డైరెక్ట్ చేస్తుండగా..యశ్‌రాజ్‌ ఫిలింస్ బ్యానర్‌ నిర్మిస్తుంది. జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రి ఇస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి నటిస్తుండటంతో..ఈ సినిమాపై తెలుగులో కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.  

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ జపాన్‌లో జ‌రుపుకుంటుంది. అక్కడ ప్రతి ఏటా ఫిబ్రవరిలో జరుపుకునే సపోరో స్నో(Sapporo Snow Festival) ఫెస్టివల్లో షూట్ చేస్తున్నారు. ఇక షూటింగ్‌ బ్రేక్ టైంలో హీరో జునైద్ ఖాన్, సాయి ప‌ల్ల‌వి సపోరో స్నో ఫెస్టివల్‌లో సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి..తెలుగులో నాగ చైతన్య హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ తండేల్ లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే త‌మిళంలో శివకార్తికేయన్ తో కలిసి యాక్షన్ డ్రామా సినిమా చేస్తుంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాను స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు.

Also Read:ఎమోషన్స్ లేని మూడో జీవి..పాము, మొసలి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు