V6 News

వేదవ్యాస్ తో సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ శుభారంభం

వేదవ్యాస్ తో  సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ శుభారంభం

దర్శకుడు ఎస్వీ  కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘వేదవ్యాస్’. ఈ సినిమాకు  సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ గురువారం జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ‘సాయి ప్రగతి ఫిలిమ్స్’  అనే బ్యానర్‌‌ను ప్రకటించారు.  ఫిల్మ్ నగర్‌‌లోని షిర్డీ సాయి బాబా దేవాలయంలో  ప్రత్యేక పూజలతో బ్యానర్ లోగోను ఆవిష్కరించారు.  ప్రస్తుతం  చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. పిడుగు విశ్వనాథ్  హీరోగా పరిచయం అవుతున్న ఈ  చిత్రంలో  కొరియన్  నటి జూన్ హ్యూంజీ,  విలన్‌‌గా మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ నటిస్తున్నారు. సాయికుమార్, సుమన్, బాబు మోహన్, శివాజీ రాజా,  అలీ, ఉత్తేజ్ , రఘు బాబు అజయ్ ఘోష్  ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం కూడా అందిస్తున్నారు.