వెంకటేష్‌‌ కెరీర్‌‌‌‌లోనే హై బడ్జెట్ మూవీ "సైంధవ్ "

వెంకటేష్‌‌ కెరీర్‌‌‌‌లోనే  హై బడ్జెట్ మూవీ "సైంధవ్ "

వెంకటేష్ హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘సైంధవ్’. నిహారిక ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ బ్యానర్‌‌‌‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. వెంకటేష్ నటిస్తోన్న 75వ చిత్రమిది.  బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ మూవీ కీలక షెడ్యూల్ హైదరాబాద్‌‌లో పూర్తయిందని ప్రకటించారు మేకర్స్.

ఈ షెడ్యూల్‌‌లో  వెంకటేష్‌‌తో పాటు ప్రధాన నటీనటులపై ఇంపార్టెంట్ సీన్స్‌‌తో పాటు ఫైట్ సీక్వెన్స్‌‌ను రూపొందించామని తెలియజేశారు మేకర్స్. ప్రస్తుతం ఓ పాట కోసం భారీ సెట్‌‌ను వేశామన్నారు. ఇది వెంకటేష్‌‌ కెరీర్‌‌‌‌లోనే  హై బడ్జెట్ మూవీ అని, సౌత్ లాంగ్వేజెస్‌‌తో పాటు హిందీలోనూ రిలీజ్ చేస్తామన్నారు నిర్మాత.  ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. వెంకటేష్ ఫెరోషియస్ గెటప్‌‌లో ఇంప్రెస్ చేశారు.  సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 22న సినిమా రిలీజ్ కానుంది.