ప్రతి ఒక్కరినీ భయపెట్టే పదం క్యాన్సర్..

ప్రతి ఒక్కరినీ భయపెట్టే పదం క్యాన్సర్..

సమాజంలో ప్రతి ఒక్కరిని భయపెట్టే పదం క్యాన్సర్ అని అన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.  సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ( ఎసిఎసి ) సహకారంతో హైదరాబాద్ , నిజాంపేటలోని ఎస్ఎల్జీ  ఆస్పత్రి ఆధ్వర్యంలో ” క్యాన్సర్ స్క్రీనింగ్ ” క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జనార్ , ఎస్ఎల్ జీ ఆసుపత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి .శివరామరాజు తో కలిసి  ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన సజ్జనార్.. ఉన్నత కుటుంబాలతో పాటు బలహీన వర్గాలు అధికంగా ఉండే మన సమాజంలో ప్రతి ఒక్కరినీ భయపెట్టే పదం ” క్యాన్సర్ ” అని  అన్నారు . సరైన అవగాహనతోనే క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చన్నారు. క్యాన్సర్ పేరు వింటేనే గ్రామీణ ప్రజలు వణికిపోతారన్నారు . అటువంటి పేద ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు పరీక్షలు చేయాలనుకునే వారికి సహకరించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు.

see more news

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఎంఐఎం ఏమైనా అంటరాని పార్టీనా?

వీడియో: బర్త్ డే పార్టీకి రానన్నాడని.. కారుతో గుద్ది చంపాడు

తెలంగాణకు..నాకు ప్రత్యేక అనుబంధం