ఒకరోజు ముందే మొదలుకానున్న సలార్ బీభత్సం.. ఫ్యాన్స్ గెట్ రెడీ

ఒకరోజు ముందే మొదలుకానున్న సలార్ బీభత్సం..  ఫ్యాన్స్ గెట్ రెడీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబందించిన టీజర్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అందరూ ఈ సినిమా టీజర్ జులై 7వ తేదీన రానుంది అనుకున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అది రూమర్ గానే మిగిలిపోయింది. ఇక తాజాగా సలార్ టీజర్(Salaar teaser) డేట్ అండ్ టైం ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీ టీజర్ జులై 6వ తేదీన ఉదయం 5:12 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. దీంతో పాటు మరో కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. 

ఎన్నాళ్ళ నుండో ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. ఈ న్యూస్ తో ఫుల్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ గత మూడు సినిమాలు తీవ్రంగా నిరాశ పరచడంతో.. సలార్ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నారు ప్రభాస్ ఫాన్స్. అంతేకాదు ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం కూడా మరో కారణం. 

కేజీఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్కడా రాజీ పడకుండా భారీగా ఖర్చు పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న సలార్ టీజర్.. యూట్యూబ్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.