కోపంతో కిచెన్, బాత్రూం క్లీన్ చేసిన సల్మాన్

కోపంతో కిచెన్, బాత్రూం క్లీన్ చేసిన సల్మాన్

బిగ్ బాస్ షో ఎంత పాపులరో అందరికీ తెలుసు. హిందీలో బిగ్ బాస్ 13 సీజన్ కు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్నారు. అయితే షోలో కంటెస్టెంట్స్ పై కోపంతో సల్మాన్ ఖాన్ హౌస్ లోకి వెళ్ళి బాత్ రూం ,కిచెన్ ను క్లీన్ చేశాడు.

కంటెస్టెంట్స్ హౌస్ ను క్లీన్ గా ఉంచుకోకపోవంతో సీరియస్ అయిన సల్మాన్ నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడు. సల్మాన్ వెళ్లేటప్పుడు కంటెస్టెంట్స్ ఉన్న రూమ్ లాక్ అవుతుంది. సల్మాన్ ఎవరినీ కలవకుండా మాట్లాడకుండా డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్లి క్లీన్ చేసి చెత్తను డస్ట్ బిన్ లో వేస్తాడు. తర్వాత బాత్రూంలోకి వెళ్లి క్లీన్ చేస్తాడు. బాత్రూంలో వెంట్రుకలు తీసేసి డస్ట్ బిన్ లో వేస్తాడు. సల్మాన్ ను చూసి కంటెస్టెంట్స్ ఒక్కసారిగా షాక్ అవుతారు. సారీ సారీ అని అరుస్తుంటారు కానీ వాళ్లను పట్టించుకోకుండా సల్మాన్ హౌస్ నుంచి బయటకు వెళ్తాడు. తర్వాత మీ టీవిలో కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. కంటెస్టెంట్స్ సారీ చెప్పినా  సల్మాన్ అంగీకరించడు.కంటెస్టెంట్స్ పై సీరియస్ అవుతాడు.  ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.