భారత్‌లో బిడ్డలకు త్వరగా పెళ్లి చేయాలనుకుంటరు

భారత్‌లో బిడ్డలకు త్వరగా పెళ్లి చేయాలనుకుంటరు

దేశంలో ఆడ పిల్లల పెండ్లి వయసును 21ఏండ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్ట ప్రకారం ప్రస్తుతం 18 ఏండ్లుగా ఉన్న ఆడ పిల్లల పెండ్లి వయసును 21కి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పలు పార్టీ మంచి నిర్ణయమని స్వాగతిస్తుంటే.. మరి కొన్ని పార్టీల నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం తీసుకున్న  నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫికర్ రహ్మాన్‌ బార్క్‌ అన్నారు. భారత్ పేద దేశమని, తమ కుమార్తెలకు వీలైనంత తర్వగా పెండ్లి చేయాలని ఎక్కువ మంది భావిస్తారని ఆయన అన్నారు. పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తాను మద్దతు ఇవ్వబోనని చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, సమాజ్‌వాదీ పార్టీకి సంబంధం లేదని అన్నారు.