'యశోద' ట్రైలర్ కోసం.. ఐదుగురు స్టార్ హీరోలు

'యశోద' ట్రైలర్ కోసం.. ఐదుగురు స్టార్ హీరోలు

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘యశోద’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. దీంతో ట్రైలర్ విడుదలకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. పాన్ ఇండియా హీరోలతో ట్రైలర్ విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసింది.

నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ట్రైలర్‌ను అక్టోబర్ 27న విడుదల చేయనున్నారు. పేరొందిన పాన్ ఇండియా హీరోలు యశోద ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలపడంతో అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తెలుగులో హీరో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, హిందీలో వరుణ్ ధావన్ 'యశోద' ట్రైలర్ విడుదల చేయనున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 'యశోద' విడుదల కానుంది. చిత్ర నిర్మాణంలో దర్శకులు హరి, హరీష్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడలేదు. అలాగే ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా వినూత్నంగా జరుపుతున్నారు.