- పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ పాలనలో సమ్మక్క, సారలమ్మ జాతర గ్రాండ్ సక్సెస్ అయిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. శనివారం గాంధీ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతరకు రూ.250 కోట్లు కేటాయించడం గిరిజన తల్లులపై తమ ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు.
గిరిజన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ జాతరను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సమ్మక్క, సారలమ్మ దీవెనలతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 90 శాతం సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
