అనారోగ్యంతో మేడారం సమ్మక్క పూజారి మృతి

అనారోగ్యంతో మేడారం సమ్మక్క పూజారి మృతి

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క దేవత పూజారి సిద్దబోయిన పాపారావు(45) అనారోగ్యంతో చనిపోయాడు. పాపారావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం ఇంట్లో కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

అప్పటికే పాపారావు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. సర్పంచ్  పీరీల భారతి -వెంకన్న, ఉప సర్పంచ్  ఆళకుంట కృష్ణ మృతుడి ఇంటికి చేరుకొని ఆయనకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుడికి భార్య సరోజన, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పూజారి మృతితో మేడారంలో విషాధం నెలకొంది.