పేదల పక్షపాతి సీఎం కేసీఆర్‌‌‌‌ : మంత్రి తలసాని

పేదల పక్షపాతి సీఎం కేసీఆర్‌‌‌‌ : మంత్రి తలసాని

పద్మారావునగర్, వెలుగు: వివిధ ప్రభుత్వ పథకాల కింద నిర్మించిన పేద ప్రజల ఇండ్ల రుణాలను మాఫీ చేసి సీఎం కేసీఆర్ పేదల పక్షపాతిగా నిలిచారని సనత్‌‌నగర్‌‌‌‌  అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  సోమవారం బన్సీలాల్ పేట డివిజన్ లోని ఉప్పలమ్మ టెంపుల్, సీసీ  నగర్ ఫేస్ 3 లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  

గురునానక్ జయంతి సందర్భంగా ఆయన సోమవారం అమీర్ పేటలోని గురుద్వార్‌‌‌‌ను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  అమీర్ పేట డివిజన్‌‌లోని గంగుబాయ్ బస్తీ, బుద్ధనగర్, అంకమ్మ బస్తీ,  హై ఎలైట్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈడెన్ అపార్ట్మెంట్‌‌లలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాల్లో  పాల్గొన్నారు.  ఆదర్శ్‌‌నగర్‌‌‌‌లోని ఎమ్మెల్యే క్వార్టర్‌‌‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ఈ నెల 30న జరిగే పోలింగ్‌‌లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.  

మంగళవారం  ఉదయం 9.00 గంటలకు బీఆర్ఎస్​ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సనత్ నగర్ లోని జెక్ కాలనీలో మంత్రి తలసాని ప్రసంగించనున్నారు. కార్యక్రమాల్లో మంత్రి వెంట కార్పొరేటర్ కుర్మ హేమలత, నాయకులు సుంకపాక వినయ్​, ఫహీమ్​, అబ్బాస్​,  ప్రేమ్ కుమార్​, రజాక్, రాజేందర్, కేఎం కృష్ణ, జ్ఞాని,  మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆనం జీత్ కౌర్, సురేందర్ సింగ్, సుమిత్ ఉన్నారు.