రంగారెడ్డి జిల్లా ఈసీ వాగు నుంచి ఇసుక రవాణా.. జేసీబీ, టిప్పర్ ను సీజ్ చేసిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా ఈసీ వాగు నుంచి ఇసుక రవాణా..  జేసీబీ, టిప్పర్ ను సీజ్ చేసిన పోలీసులు

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని ఈసీ వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న జేసీబీ, టిప్పర్​ను పోలీసులు శనివారం అర్ధరాత్రి సీజ్ చేశారు.  ఈసీ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో హెడ్​కానిస్టేబుల్ వి. చంద్రశేఖర్, కానిస్టేబుల్ అనిల్ కలిసి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జేసీబీ సహాయంతో టిప్పర్​లో ఇసుక నింపుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. 

అయితే పోలీసులను గమనించిన డ్రైవర్లు వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో ఆ జేసీబీ, టిప్పర్​ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు. విచారణలో ఈ వాహనాలు పోతుగల్ గ్రామానికి చెందిన కేశపల్లి కరుణాకర్ రెడ్డికి చెందినవిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కాంతారెడ్డి వెల్లడించారు.