
రాజా బహదూర్ వెంకట రామరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడామీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య బాధ్యతలు స్వీకరించారు. జనవరి 3న జరిగిన పోలీస్ ఉన్నతాధికారుల బదిలీల ఉత్తర్వులను అనుసరించి సందీప్ శాండిల్య రైల్వే, రోడ్ సెప్టీ విభాగం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. అంతకుముందు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాసరావు నుండి ఆయన ఛార్జ్ తీసుకున్నారు. 1993 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ఇప్పటి వరకు పలు హోదాలలో పని చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.