ఫోర్బ్స్ ఇండియా లిస్ట్​లో కోదాడ వాసి

ఫోర్బ్స్ ఇండియా లిస్ట్​లో కోదాడ వాసి

 'డొనేట్ కార్ట్' తో సోషల్​ సర్వీస్​చేస్తున్న సందీప్ శ్రీవాత్సవ్ శర్మ
కోదాడ, వెలుగు :
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయికి చెందిన నందుల సందీప్ శ్రీవాత్సవ్ శర్మ(26)కు అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా –30 - లిస్టులో మోస్ట్ ​ఎఫెక్టివ్ ​పర్సన్​గా సందీప్ శర్మకు స్థానం లభించింది. నాగపూర్ ఎన్ఐటీలో ఇంజినీరింగ్ చేసిన శ్రీ వాత్సవ్​తన ఫ్రెండ్​ అనిల్ రెడ్డితో కలిసి డొనేట్ కార్ట్ సంస్థను ప్రారంభించాడు. ఈ ఆర్గనైజేషన్ దేశంలోని పలు ఎన్జీఓలతో కలిసి పని చేస్తోంది. పేదవారికి అవసరమైన ఫండ్, ఇతర వస్తువులను డోనర్స్​ నుంచి కలెక్ట్​ చేసి ఇప్పిస్తూ మీడియేటర్​గా వ్యవహరిస్తోంది. 2017లో ముంబై కేంద్రంగా ప్రారంభించిన ఈ సంస్థ150 కోట్లకు పైగా ఫండ్స్​కలెక్ట్ చేసి పలు ఎన్జీఓలకు కావలసిన వస్తువులను సమకూర్చింది. ప్రస్తుతం హైదరాబాద్ టి హబ్ కేంద్రంగా పని చేస్తోంది. చెన్నైలో వరదలు వచ్చినప్పుడు బాధితులకు డ్రింకింగ్​వాటర్, చద్దర్లు , ఫుడ్, మెడిసిన్​అందజేసింది. కరోనా టైంలో రోజువారీ, వలస కూలీలకు ఎన్జీఓలతో కలిసి డెయిలీ నీడ్స్, హాస్పిటల్స్ కు అవసరమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్​,  బెడ్స్,​ పల్స్ మీటర్స్,  మెడికల్ కిట్స్ సమకూర్చింది. ముంబైలోని ధారావిలోని రోజువారీ కార్మికులకు నెలకు సరిపడ వస్తువులను ఇచ్చింది. సూర్యాపేటలోని హాస్పిటల్ కి ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు చెందిన యూవీ ఫౌండేషన్​నుంచి కావలసిన వస్తువులను ఇవ్వడంలో కీలకపాత్ర పోషించింది. ఈ సేవలను గుర్తించిన ఫోర్బ్స్ ఇండియా ఈ ఏడాది లిస్టులో  శ్రీవాత్సవ్​తో పాటు చిత్తూరు జిల్లా కొత్తకొటకు చెందిన అనిల్​రెడ్డికి కూడా చోటిచ్చింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ ​ద్వారా వీరికి విషెష్ ​చెప్పారు.