దేశం సింహంలా గర్జిస్తోంది.. 22 నిమిషాల్లోనే పాక్‌‌‌‌ను మోకరిల్లేలా చేశాం: కేంద్ర మంత్రి సంజయ్‌‌‌‌ సేత్‌‌‌‌

దేశం సింహంలా గర్జిస్తోంది.. 22 నిమిషాల్లోనే పాక్‌‌‌‌ను మోకరిల్లేలా చేశాం: కేంద్ర మంత్రి సంజయ్‌‌‌‌ సేత్‌‌‌‌

ఇండోర్‌‌‌‌‌‌‌‌: సరికొత్త ఇండియా సింహంలా గర్జిస్తోందని, ప్రపంచంలోని పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ లీడర్స్‌‌‌‌ కళ్లల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడుతోందని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్‌‌‌‌ సేత్‌‌‌‌ అన్నారు. ఆపరేషన్‌‌‌‌ సిందూర్‌‌‌‌‌‌‌‌లో భాగంగా కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్‌‌‌‌ను మోకాళ్లపై కూర్చోబెట్టామని చెప్పారు. దేశీయంగా తయారైన ఆయుధాలనే ఆపరేషన్‌‌‌‌ సిందూర్‌‌‌‌‌‌‌‌లో ఉపయోగించి గెలిచామని, ఈ విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఇండియా సత్తా ఎంటో తెలిసిందన్నారు.

‘‘మన బిడ్డలకు హానీ తలపెట్టే టెర్రరిస్టులను బూడిద చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌‌‌‌‌‌‌‌ సభలో హెచ్చరించారు. ఆపరేషన్‌‌‌‌ సిందూర్‌‌‌‌‌‌‌‌ సమయంలో మన సైనికులు 22 నిమిషాల్లోనే పాకిస్తాన్‌‌‌‌ను మోకరిల్లేలా చేశారు. ఈ ఆపరేషన్‌‌‌‌ ఇండియాకు పెద్ద విజయం. స్వదేశీ ఆయుధాలతోనే ఆపరేషన్‌‌‌‌ను సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా నిర్వహించాం. ఇండియన్‌‌‌‌ ఆర్మీకి నా సెల్యూట్‌‌‌‌. ఆపరేషన్‌‌‌‌ తర్వాత పాకిస్తాన్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మిలిటరీ ఆపరేషన్స్‌‌‌‌ (డీజీఎంవో) ఇండియాకు లొంగిపోయారు”అని పేర్కొన్నారు.