IND vs BAN: 15 బంతుల్లో 10 పరుగులే.. శాంసన్ కంటే అక్షర్ ఎక్కువయ్యడా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏం జరుగుతుంది

IND vs BAN: 15 బంతుల్లో 10 పరుగులే.. శాంసన్ కంటే అక్షర్ ఎక్కువయ్యడా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏం జరుగుతుంది

బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గజిబిజిగా మారింది. బుధవారం ( ఒకరు కూడా తమ బ్యాటింగ్ ఆర్డర్ లో రాలేదు. బుధవారం (సెప్టెంబర్ 24) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా పిచ్చి ప్రయోగాలు ఫలించలేదు. ఓపెనర్లు ఇచ్చిన అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిలబెట్టలేక ఒక మాదిరి స్కోర్ కే పరిమితమయ్యారు. అభిషేక్ శర్మ విధ్వంసం.. చివర్లో హార్థిక్ పాండ్య బాధ్యతాయుత ఇన్నింగ్స్ తప్పితే టీమిండియా బ్యాటింగ్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు ఓపెనర్లు గిల్, అభిషేక్ శర్మ తొలి వికెట్ కు 77 పరుగులు జోడించారు. మూడో స్థానంలో అనూహ్యంగా దూబేను పంపారు. కానీ దూబే 2 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ కంటే ముందుగా హార్దిక్ పాండ్య బ్యాటింగ్ కు రావడం మరో షాకింగ్. హార్దిక్ పర్వాలేదనిపించగా.. తిలక్ విఫలమయ్యాడు. ఏడో స్థానంలో అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కు పంపారు. అయితే మన జట్టులో ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ ఉన్నాడనే సంగతే టీమిండియా యాజమాన్యం మర్చిపోయినట్టున్నారు.

ఐదో స్థానంలో బ్యాటింగ్ కు రావాల్సిన సంజు శాంసన్ 5 వికెట్లు పడినా 7 స్థానంలో కూడా బ్యాటింగ్ కు రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు శాంసన్ ను జట్టులో ఎందుకు ఉంచారో అర్ధం కాలేదు. పోనీ శాంసన్ కంటే ముందొచ్చిన ఆకాశర్ పటేల్ ఏమైనా  బ్యాటింగ్ ఆడాడా అంటే అది కూడా లేదు. 15 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. అక్షర్ ఇన్నింగ్స్ లో ఒక్క బౌండరీ కూడా లేదు. మొత్తానికి కీలక మ్యాచ్ లో అనవసర ప్రయోగాలతో టీమిండియా బ్యాటింగ్ లో రాణించలేకపోయింది. 

►ALSO READ | IND vs BAN: అభిషేక్ ఒక్కడిదే విధ్వంసం.. బంగ్లాదేశ్ ముందు టీమిండియా ఒక మాదిరి టార్గెట్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన ఇండియా.. అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75: 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ తో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. చివర్లో కొన్ని మెరుపులతో హార్దిక్ పాండ్య (38) ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ రెండు.. తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్ తలో వికెట్ తీసుకున్నారు.  తొలి 10 ఓవర్లలో 96 పరుగులు చేసిన టీమిండియా చివరి 10 ఓవర్లలో 72 పరుగులు మాత్రమే చేయగలిగింది.