సంక్రాంతి కి సొంతూళ్లకు పయనం

సంక్రాంతి కి సొంతూళ్లకు పయనం

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పట్టణాల నుంచి సొంత గ్రామాలకు జనం పయనం కావడంతో శుక్రవారం జిల్లాలోని అన్ని బస్టాండ్లు కిటకిటలాడాయి. ఖమ్మం పాత బస్టాండలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో బస్సులు రాగానే సీటు కోసం కిటికీల్లో నుంచి బ్యాగ్​లు పెట్టడం కనిపించింది. మరోవైపు స్కూళస్లకు సంక్రాంతి  సెలవులు ఇవ్వడంతో హాస్టళ్లలోని స్టూడెంట్స్​కూడా పేరెంట్స్​తో కలిసి ఇండ్లకు బయల్దేరారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం