కుషాయిగూడ, వెలుగు: చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా సంతోశ్ కుమార్ రాయ్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. వరంగల్ జైలు సూపరింటెండెంట్ గా ఉన్న సంతోశ్ కుమార్ ను చర్లపల్లి సెంట్రల్ జైలుకి బదిలీ చేస్తూ ఈ నెల 22న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చర్లపల్లి సూపరింటెండెంట్ గా ఉన్న సంపత్ ను వరంగల్ జైలుకి బదిలీ చేసింది.
