సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఐకానిక్ మార్కెట్ ఎనలిస్ట్ అవార్డు

సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఐకానిక్ మార్కెట్ ఎనలిస్ట్ అవార్డు

హైదరాబాద్, వెలుగు: ఫైనాన్షియల్​ అడ్వైజరీ రంగంలో తన విశేష కృషికి గాను జీక్యాపిటల్ ఫౌండర్​ సత్య సంతోష్ 'ఇండియన్ ఐకానిక్ మార్కెట్ ఎనలిస్ట్ 2025' అవార్డులు అందుకున్నారు. ప్రైడ్ ఇండియా అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన 'ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ 2025' కార్యక్రమంలో ఆయన ఈ గుర్తింపును దక్కించుకున్నారు. పెట్టుబడిదారులకు అధిక లాభాలను ఆర్జించి పెట్టడంలో, వారికి సంపదను సృష్టించడంలో ఆయన అందించిన సలహాల కోసం ఈ అవార్డును ప్రదానం చేశారు.

ఈ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా సత్య సంతోష్ మాట్లాడుతూ, ఈ అవార్డు తన వ్యక్తిగత విజయమే కాకుండా, తన టీమ్​ నిరంతర కృషికి,  తన పెట్టుబడిదారులకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు.  వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి సత్కరించే లక్ష్యంతో ఈ అవార్డులను ప్రైడ్ ఇండియా అవార్డులను సంస్థ ప్రతి సంవత్సరం ఇస్తోంది.