హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 6న జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకుల సెక్రటరీ కంభంపాటి శారద తెలిపారు. ఆర్‌జేసీసీఈటీ-2026 ద్వారా ఇప్పటికే రెండు విడతల్లో అడ్మిషన్లు పూర్తి చేసినప్పటికీ, కొన్ని కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అర్హత ఉన్న విద్యార్థులు తమ జిల్లాలో జరిగే స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరై అందుబాటులో ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్టడీ, కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తదితర అవసరమైన పత్రాలను వెంట తీసుకురావాలని తెలిపారు.
