సర్కారు బడి పిల్లల కోసం ఆటో

సర్కారు బడి పిల్లల కోసం ఆటో

తాడ్వాయి/ కల్లూరు/ గుండాల, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం పలువురు తమవంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్​ జీపీ తక్కల్లపాడు గుత్తికోయగూడెంలో 15 మంది విద్యార్థులు 5 కిలోమీటర్ల దూరం నుంచి నార్లపూర్​ స్కూల్​వచ్చి చదువుతున్నారు. దీంతో ఎంఈవో గడ్డి శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం.కోర్నిబెల్లి నారాయణరావు, కాంప్లెక్స్​హెచ్ఎం విద్యాసాగర్​కలిసి నెలకు రూ.4 వేలతో విద్యార్థులను చేరవేసేందుకు ఆటోను ఏర్పాటు చేశారు.

ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని శాంతినగర్​ ప్రభుత్వ పాఠశాలకు తోపుడు బండి ఫౌండేషన్​ వ్యవస్థాపకులు సాదిక్​ అలీ 63వ జయంతి సందర్భంగా 15 డ్యూయల్​ డెస్క్​లను ఆయన సతీమణి ఉషా సాదిక్​ అందజేశారు. అంతకుముందు హెచ్ఎం రత్నకుమారి అధ్యక్షతన సాదిక్​ అలీ ఫొటోకు నివాళులర్పించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామరతొగు గ్రామంలో సీఐ తిరుపతి, ఎస్సై శ్రావణ్​కుమార్​ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు, గొడుగులు అందజేశారు.  ​