‘వరంగల్’లో భారీ వర్షం 

‘వరంగల్’లో భారీ వర్షం 

ములుగు/ కాశీబుగ్గ, వెలుగు: ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. గ్రేటర్​ వరంగల్​లో కురిసిన వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాగా, ములుగు జిల్లాలో మోస్తారు వర్షం కురువగా అత్యధికంగా వెంకటాపూర్​ మండలంలో 44..3మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

మల్లంపల్లి లో 42.8మి.మీ, లక్ష్మీదేవిపేటలో 34.5, ములుగులో 32.8మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈ సందర్భంగా కలెక్టర్​ బోర్ఖడే హేమంత్​సహదేవరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.