కుప్ప కూలిన సర్దార్ సర్వాయి పాపన్నకోట

కుప్ప కూలిన సర్దార్ సర్వాయి పాపన్నకోట

భారీ వర్షాలకు  సర్దార్ సర్వాయి పాపన్న కోట కుప్ప కూలింది. గోల్కొండ కోటను జయించిన తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోట నేల మట్టమైంది. ఆయన స్వస్థలం అయిన జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలాశాపూర్ గ్రామంలోని కోట ఇటీవలే వర్షాలకు బీటలు వారింది. అయినా ఎవరూ పట్టించుకోక పోవడంతో ఉదయం కూలి పోయింది. అదృష్ట వశాత్తూ ఎవరికి ప్రమాదం జరగలేదు. ప్రత్యేక రాష్ట్ర వచ్చాక కూడా మన చారిత్రక కట్టడాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. 6 ఏళ్ల నుంచి ఒక్కరు కూడా కోట నిర్వహణను పట్టించుకోలేదంటున్నారు. 350 ఏళ్లనాటి కోట కూలడంతో గ్రామస్తులు, జిల్లా వాసులు చింతిస్తున్నారు.

జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి సీరియస్

గతేడాది కంటే పెరిగిన ప్రధాని మోడీ సంపాదన