సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చిలాపూర్ సర్పంచ్ క్యాండిడేట్ పవ్వాడి అంజలికి పోలింగ్ కు కొన్ని గంటల ముందు గుండెపోటు రావడంతో కుటుంబ సబ్యులు ఆమెను కరీంనగర్ కు తరలించారు. శనివారం అర్థరాత్రి బెజ్జంకి పోలీసులు అంజలి భర్త మల్లికార్జున్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అకారణంగా తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించడంతో ఆందోళనకు గురైన అంజలికి తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. అంజలి ప్రాణాపాయం నుంచి గట్టెక్కగా, అక్కడే చికిత్స పొందుతోంది. బెజ్జంకి పోలీసులు మల్లికార్జున్ ను విచారణ అనంతరం ఆదివారం ఉదయం వదిలిపెట్టారు. మల్లికార్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
