ఎంపీడీవో ఆఫీసు ఎదుట సర్పంచ్ నిరసన

ఎంపీడీవో ఆఫీసు ఎదుట సర్పంచ్ నిరసన

కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం ఎంపీడీవో ఆఫీసు ఎదుట పాపయ్యపల్లి గ్రామ సర్పంచ్ ఆగయ్య నిరసనకు దిగాడు. తమకు రావాల్సిన బిల్లులు రాకుండానే ఆన్ లైన్ లాక్ చేశారని ఆవేదన చెందన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎంపీడీవో కల్పనతో ఫోన్ లో మాట్లాడిన ఆగయ్య తన సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. 

పై అధికారులతో మాట్లాడుతానంటూ ఎంపీడీవో అతనికి భరోసా ఇచ్చింది. బిల్లులు రాక అప్పులు చేసి సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగయ్య తెలిపాడు. తాను చేస్తున్న నిరసన తన ఒక్కడి కోసం కాదని.. తమ హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించాడు. కొందరు సర్పంచ్ లు సమస్యలు బయటకు చెప్పడానికి భయపడుతున్నారన్నాని చెప్పాడు. కాగా, చివరకు ఆగయ్యకు పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.