90 రోజులు ఊరు బాగుకు

90 రోజులు ఊరు బాగుకు

పక్కా ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి
చేసిన పనులు మూడు రోజులకోసారి తనిఖీ
పచ్చదనం, పారిశుద్ధ్యం మెరుగుకు మార్గం

పల్లె సీమల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని అనుసరిస్తూ తొలి విడతగా మూడు నెలల ప్రణాళిక తయారు చేసింది. ఇందుకు ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శి , సర్పం చ్ లకు శిక్షణ సైతం నిర్వహిస్తోంది. ఈ నెల 1వ తేదీ నుం చి 90 రోజుల పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. శిక్షణ పొందిన ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో ప్రజలకు వివరించి అభివృద్ధిలో భాగస్వాములను చేయనున్నారు.