మంత్రి సబితకు బీజేపీ కార్పొరేటర్​ సవాల్​

మంత్రి సబితకు బీజేపీ కార్పొరేటర్​ సవాల్​

రంగారెడ్డి జిల్లా : మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మంత్రి సబిత వైఫల్యాలను ఎత్తి చూపినందుకు తమపై అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు. సబిత కుమారుడుతో పాటు అనుచరులు చేస్తున్న భూ కబ్జాలను ప్రశ్నించినందుకు తమపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులకు ఏమాత్రం భయపడకుండా రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ కార్యకర్తలు మరింత ముందుకెళ్తారని అన్నారు.

మంత్రి సబిత వైఫల్యాలను నియోజకవర్గం ప్రజలందరికీ తెలియచేయడానికి గడప గడపకు తిరిగి ప్రచారం చేస్తామని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని వాగ్దానం చేశారు. తనపై నమోదైన కేసులపై వివరణ ఇచ్చేందుకు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి  రాచకొండ కమిషనరేట్​ పరిధిలోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా కార్పొరేటర్​ శ్రీవాణి మంత్రి సబితపై తీవ్ర విమర్శలు చేశారు.