V6 News

శాతవాహన కెమిస్ట్రీ విభాగానికి పేటెంట్ మంజూరు

శాతవాహన కెమిస్ట్రీ విభాగానికి పేటెంట్ మంజూరు
  • క్యాన్సర్ నిరోధానికి ఔషధాన్ని అభివృద్ధి చేసిన వర్సిటీ ప్రొఫెసర్లు

కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు డాక్టర్ ఎ. జయంతి, డాక్టర్ ఎన్. మల్లారెడ్డి చేసిన పరిశోధనకు అరుదైన గుర్తింపు లభించింది. క్యాన్సర్‌‌ నిరోధానికి ఉపయోగపడే కొత్త రసాయన సంయోగాలను అభివృద్ధి చేసినందుకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ మంజూరైంది.

" బెంజిమిడాజోల్-ట్రైజోల్ సంయోగాలు క్యాన్సర్ నిరోధకంగా” పనిచేస్తాయని తమ పరిశోధనలో వెల్లడైనట్లు తెలిపారు. ఔషధ రసాయన శాస్త్రం, క్యాన్సర్ పరిశోధనలో ఇది ముందడుగని వర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్ ప్రశంసించారు. ఈ పరిశోధనకు టీజీసీఓఎస్​టీ సంస్థ ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఈ పేటెంట్‌‌తో యూనివర్సిటీకి 20 ఏండ్ల పాటు ప్రత్యేక హక్కులు సమకూరుతాయని, పరిశోధనకు చట్టపరమైన రక్షణ, వాణిజ్య అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.