లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో నాగ మోహన్ నిర్మించిన చిత్రం ‘సతీ లీలావతి’. సమ్మర్ స్పెషల్‌గా మే 8న సినిమా విడుదల కానుంది. శనివారం ఈ మూవీ ట్రైలర్‌ను రామ్ చరణ్ రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం మేం పెట్టిన శ్రమ, ప్రేమ, కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు.
షూటింగ్ టైమ్‌లో నేను ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. దేవ్ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పారు. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మా బావ గారు రామ్ చరణ్‌కి థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల ట్రైలర్‌కి, సినిమాకు రీచ్ పెరిగింది. ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది’ అని చెప్పారు.
ఈ చిత్రంలో తన పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుందని దేవ్ మోహన్ అన్నాడు. భార్యభర్తల మధ్య సాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని దర్శకుడు తాతినేని సత్య చెప్పాడు. అందరూ సరదాగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత నాగ మోహన్ అన్నారు. నటులు సప్తగిరి, తాగుబోతు రమేష్, అభినయ శ్రీనివాస్, రైటర్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
