
హమరేశ్, ప్రార్థన సందీప్ జంటగా వాలీ మోహన్‌దాస్ దర్శకత్వంలో కె బాబు రెడ్డి, జి సతీష్ కుమార్ నిర్మించిన తమిళ చిత్రం ‘రంగోలి’. అక్కడ సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని శివమ్ మీడియా బ్యానర్‌పై శివ మల్లాల ‘సత్య’ టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్, సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుందనే నమ్మకం ఉందని హమరేశ్, ప్రార్థన అన్నారు. ఇలాంటి హార్ట్‌ఫుల్ ఫిల్మ్ చేసినందుకు హ్యాపీగా ఉందని వాలి మోహన్ దాస్ చెప్పాడు. తెలుగులో తమ చిత్రాన్ని శివ మల్లాల విడుదల చేయడం సంతోషంగా ఉందని నిర్మాతలు బాబు రెడ్డి, సతీష్ అన్నారు. నాన్నపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుందని నిర్మాత శివ మల్లాల అన్నారు.