ఫుల్ బాటిల్ షూటింగ్ స్టార్ట్

ఫుల్ బాటిల్  షూటింగ్ స్టార్ట్

ప్రస్తుతం టాలీవుడ్ లో వైవిధ్యమైన టైటిల్స్, వెరైటీ కథలతో దర్శకులు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కామెడీతో కూడిన చిత్రాలు రూపొందిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన చిత్రాలు సక్సెస్ అయ్యాయి. చిన్న చిత్రాలైనా ప్రేక్షకులు ఆదరించారు. విభిన్నమైన కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరోల్లో సత్యదేవ్ కూడా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన ఈయన.. తర్వాత హీరోగా మారాడు. పూరి జగన్నాథ్ చిత్రంలో జ్యోతి లక్ష్మి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. అనంతరం పలు చిత్రాల్లో ఆఫర్స్ కూడా వచ్చాయి. ఈ యంగ్ హీరో నిర్మాతగా అవతారంమెత్తాడు.

SD కంపెనీ పేరిట ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి ‘ఫుల్ బాటిల్’ పేరిట సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ముహూర్తం సెర్మనీ నిర్వహించిన చిత్ర యూనిట్.. షూటింగ్ మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ప్రకటించింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. 78.1 శాతం కామెడీ, 21.9 శాతం యాక్షన్ ఉంటుందని గతంలో సత్యదేవ్ చెప్పుకొచ్చారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ లో ఆటోలో డ్రైవింగ్ సీట్ లో అబ్బాయి, వెనుక అమ్మాయి కూర్చొని ఉంది. ఆటోపైన మందు సీసాలో ‘ఫుల్ బాటిల్’ అని టైటిల్ ఉంది. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కె సినిమాలో ‘సత్యదేవ్’ తాగుబోతుగా కనిపించనున్నారని తెలుస్తోంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుని ముందుకు వెళుతున్న ‘సత్యదేవ్’ ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వెయిట్ అండ్ సి.

మరిన్ని వార్తల కోసం : -

నయన్ -విఘ్నేశ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో !


పాటపాడుతూ తుది శ్వాస విడిచిన ఎడవ బషీర్