
సత్యం రాజేష్ హీరోగా వై.యుగంధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టెనెంట్’. మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్ నోరోన్హా, భరత్ కాంత్ కీలక పాత్రలు పోషించారు. మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘మన ఎదురింట్లో లేక పక్కింట్లో జరిగే కథలా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యల నేపథ్యంలో ఉంటుంది. నిజ జీవితానికి దగ్గరగా ప్రతి సీన్ చాలా బాగుంటుంది. ఓవర్ డైలాగ్స్ ఉండవు. సినిమాలో నాకు డైలాగ్స్ తక్కువ.
నా పాత్ర చూసి ఆడియన్స్ సింపతీతో బయటకు వస్తారు. సినిమాలో ట్విస్ట్‌లు ఉండవు కానీ.. సస్పెన్స్ ఉంటుంది. మర్డర్ మిస్టరీ కనుక ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదు. మొదట ఓటీటీ కోసమని చేసినా, సినిమా అవుట్‌పుట్ చూశాక థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనుకున్నాం. నటుడిగా కొనసాగుతూనే మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాల్లో లీడ్ రోల్స్ చేయాలనుకుంటున్నా. అందుకు తగ్గ కథలనే ఎంచుకుంటున్నా. లీడ్ రోల్‌లో ‘స్ట్రీట్ ఫైట్’ అనే కామెడీ ఎంటర్‌టైనర్ చేస్తున్నా’ అని చెప్పాడు.