15 పులులను దత్తత తీసుకున్న ఎస్​బీఐ

15 పులులను దత్తత తీసుకున్న ఎస్​బీఐ

హైదరాబాద్, వెలుగు: నెహ్రూ జూ పార్క్ లోని 15 పులులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సర్కిల్ బ్రాంచ్ సోమవారం దత్తత తీసుకుంది.  వరుసగా పదో సంవత్సరం  టైగర్స్ ని ఎస్​బీఐ అడాప్ట్ చేసుకుంది. దత్తత తీసుకున్న పులుల రక్షణ కోసం ఎస్‌‌‌‌బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ రూ.15 లక్షలు చెక్కును  తెలంగాణా ప్రిన్సిపల్ చీఫ్​ కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఐఎఫ్ఎస్ ఆర్. శోభ కు అందించారు. అనంతరం పబ్లిక్ డిస్‌‌‌‌ప్లే కోసం ప్రారంభించిన ఏషియాటిక్ లయన్స్ ఎన్‌‌‌‌క్లోజర్‌‌‌‌లో ఒక జత లయన్స్‌‌‌‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి శోభ .. ఎస్ బీఐ, హైదరాబాద్ సర్కిల్ బ్రాంచ్ ను అభినందించారు. కార్యక్రమంలో జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్ పాల్గొన్నారు.