20 కోట్ల యోనో యూజర్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌

20 కోట్ల యోనో యూజర్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌

న్యూఢిల్లీ:  యోనో యాప్  యూజర్లను వచ్చే రెండేళ్లలో  10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  చైర్మన్ సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శెట్టి అన్నారు. యోనో కొత్త వెర్షన్  సోమవారం (డిసెంబర్ 15న) లాంచ్ అవుతుందని,  వచ్చే  6–8 నెలల్లో పూర్తి ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.   ‘‘ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కామన్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.  

అన్ని ఆన్‌లైన్ సెగ్మెంట్లు వేగంగా ఇంటిగ్రేట్ అవుతాయి. దీంతో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కొత్త ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తీసుకురావడం సులభమవుతుంది. యోనో 2.0 తో డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విస్తరిస్తాం”అని శెట్టి వివరించారు.  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  డిసెంబర్ 5న రెపో రేటును  25 బేసిస్ పాయింట్లు  తగ్గించి 5.25శాతం చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ తన రెపో లింక్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెండింగ్ రేటును  7.90శాతానికి తగ్గించింది.  ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ అన్ని టెనర్లలో 5 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది.