స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్. మే 23 నుండి మే 28 వరకు వరుసగా 6 రోజుల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో SBI బ్యాంక్ బ్రాంచ్‌లు మూతపడే అవకాశం ఉంది. వీకెండ్ సెలవులు, ఉద్యోగుల సమ్మె, బక్రీద్ పండుగ కారణంగా ఈ సెలవులు వస్తున్నాయి. కాబట్టి, బ్యాంకుకు వెళ్లాల్సిన ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే ముందే చేసుకోవడం మంచిది.
బ్యాంకులు మూసేయడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే :
1. వీకెండ్ హాలిడేస్
మే 23 (నాల్గవ శనివారం), మే 24 (ఆదివారం) ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలలో రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులకు సెలవు.
2. ఎస్‌బిఐ ఉద్యోగుల సమ్మె
ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (SBI ఉద్యోగుల సంఘం) వారి సమస్యల పరిష్కారం కోసం మే 25 (సోమవారం), మే 26 (మంగళవారం) తేదీలలో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ కారణంగా సోమ, మంగళవారాల్లో బ్యాంక్ సేవలకు పనిచేయవు.
3. బక్రీద్ పండుగ సెలవులు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో బక్రీద్ పండుగను వేర్వేరు రోజుల్లో జరుపుకుంటారు. అందుకే ఆర్‌బీఐ (RBI) కూడా బక్రీద్ పండుగ కోసం రెండు రోజులు సెలవుగా ప్రకటించింది. దింతో మే 27న దేశంలోని చాలా ప్రాంతాల్లో... అలాగే మే 28న కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో సెలవు ఉంటుంది. ఇక జమ్మూ & కాశ్మీర్లో మే 27, మే 28 రెండు రోజులూ బ్యాంకులు పనిచేయవు.
ఆన్‌లైన్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు
బ్యాంక్ బ్రాంచ్‌లు మూసి ఉన్న.... ఎస్‌బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI మొదలైనవి... లావాదేవీలు, ఏటిఎం సేవలు ఎప్పటికప్పుడు, యథావిధిగా అందుబాటులో ఉంటాయి.
ఎస్‌బిఐ ఉద్యోగులు సమ్మెకు ఎందుకు ?
ఉద్యోగుల సంఘం ముఖ్యంగా లేవనెత్తిన 3 ముఖ్యమైన సమస్యలు ఇవే:
అవుట్‌సోర్సింగ్ విధానం: బ్యాంకులో పనులను అవుట్‌సోర్సింగ్ చేయడం వల్ల.. గ్రామీణ యువత, వెనుకబడిన తరగతులు (SC, ST, OBC), ఆర్థికంగా బలహీన వర్గాల వారికి ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోతున్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
సెక్యూరిటీ గార్డుల కొరత: రిటైర్మెంట్లు, ప్రమోషన్ల వల్ల బ్యాంకుల్లో సెక్యూరిటీ గార్డుల సంఖ్య తగ్గిపోయింది. కొత్తగా ఎవరినీ నియమించకపోవడం వల్ల బ్యాంక్ ఆస్తులకు, కస్టమర్లకు, సిబ్బందికి రక్షణ కరువైందని చెప్తున్నారు.
పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను మార్చుకునే అవకాశం: ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారులు తమ ఫండ్ మేనేజర్‌ను మార్చుకునే అవకాశం ఉంది. మిగతా ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ సదుపాయం ఉన్నా, ఎస్‌బిఐ మాత్రం ఉద్యోగులకు ఈ ఛాన్స్ ఇవ్వడం లేదని, దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
