SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు

SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ(SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్.  సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై మినిమమ్ బ్యాలెన్స్(AMB) తొలగిస్తున్నామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అది మాత్రమే కాదు.. ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్ క్రింద మూడు నెలలకోసారి వసూలు చార్జీలను కూడా తొలిగించింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో ఉన్న 44.51 కోట్ల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది.

గతేడాది 2018 ఏప్రిల్ నుంచి మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరి చేసిన ఎస్బీఐ..  రూరల్‌లో రూ.1000, సెమీ అర్బన్‌లో రూ.2000, మెట్రోలో రూ.3000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న నిబంధనలు చేసింది. ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే రూ.5 నుంచి రూ.15 వరకు ఛార్జీలను కూడా వసూలు చేసింది. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఖాతాదారులకు పెద్ద తలనొప్పిగా మారడంతో ఇప్పుడు ఆ నిబంధనను తొలగిస్తూ SBI నిర్ణయం తీసుకుంది.

అంతేకాకుండా సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను రేషనలైజ్ చేసింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరికీ 3 శాతం వార్షిక వడ్డీని ప్రకటించింది ఎస్‌బీఐ.