ఎస్‌‌బీఐ కస్టమర్‌‌లు ఈ డాక్యుమెంట్‌‌లను ఇవ్వాల్సిందేనట

ఎస్‌‌బీఐ కస్టమర్‌‌లు ఈ డాక్యుమెంట్‌‌లను ఇవ్వాల్సిందేనట

న్యూఢిల్లీ: దేశ పబ్లిక్ సెక్టార్‌‌లో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌బీఐ) తమ కస్టమర్లకు ఓ నోటీసు జారీ చేసింది. ఈ నెల ఆఖరులోగా కస్టమర్లు తమ పాన్, ఆధార్ కార్డులను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేసుకోవాలని తెలిపింది. జూన్ 30లోగా ఎస్‌‌బీఐ కస్టమర్లు పాన్, ఆధార్ కార్డులను లింకప్ చేసుకోకుంటే వారి సర్వీసుల విషయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. నిరంతరాయ బ్యాంకింగ్ సర్వీసులను పొందాలంటే కస్టమర్లు వెంటనే తమ పాన్, ఆధార్ కార్డులను బ్యాంకులో సమర్పించాలని సూచించింది.