ఆగిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఆరోగ్య ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!.. షాక్‌‌లో పాలసీ హోల్డర్లు

ఆగిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఆరోగ్య ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!..  షాక్‌‌లో పాలసీ హోల్డర్లు
  • రెన్యువల్ చేసుకోవడానికి కుదరడం లేదని వెల్లడి

  • జీవిత కాలం పాటు ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీమియంకే పాలసీ ఇస్తామని చెప్పి కస్టమర్లను ఆకర్షించిన కంపెనీ

న్యూఢిల్లీ : పాపులర్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్ పాలసీ ఆరోగ్య ప్లస్  కొన్న కస్టమర్లు షాక్‌‌లో  ఉన్నారు.  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఈ లో– కాస్ట్ పాలసీని సైలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అమ్మడం ఆపేసింది.  రెగ్యులేటరీ రూల్స్ ఉల్లంఘించడంతోనే ఈ పాలసీని  కంపెనీ  కొనసాగించడం లేదని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీటీవీ ప్రాఫిట్ రిపోర్ట్ చేసింది.  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అఫీషియల్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరోగ్య ప్లస్ పాలసీని రెన్యువల్ చేసుకోవడానికి కుదరడం లేదు. రెన్యువల్ చేసుకునే పాలసీల లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ పాలసీ  పేరే లేదు.  ఈ పాలసీని విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకున్నామని, ఇతర పాలసీల్లో ఇది విలీనమయ్యిందని కంపెనీ కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్ చెబుతోంది. కానీ,  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అమ్మే ఏ ఇతర పాలసీ కూడా జీవితాంతం ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీమియంను ఆఫర్ చేయడం లేదు. నో -ఏజ్ లిమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెంట్లపై పరిమితి లేకపోవడం, కో-పేమెంట్ లేకపోవడం వంటి ఫీచర్లను ఆఫర్ చేయడం లేదు. అంతేకాకుండా ఏజెంట్లు కూడా తమ కస్టమర్లకు ఈ పాలసీని అమ్మడం లేదు. ఎక్కువ ప్రీమియం ఉండే మరో పాలసీకి మారాలని  లేదా ఆరోగ్య ప్లస్ పాలసీ నుంచి బయటకొచ్చేయాలని సలహా ఇస్తున్నారు. ఈ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీని విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకుంటున్నట్టు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జనరల్ ఇంకా ప్రకటించలేదు.

పాలసీ ఏంటంటే..

వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఫ్లాట్ ప్రీమియంకే ఆరోగ్య ప్లస్ పాలసీ అందుబాటులో ఉంది. హాస్పిటల్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెంట్ పై పరిమితులు లేవు.  అలానే ఏజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి వేసే అదనపు ఛార్జీలు కూడా లేవు. ఫ్యామిలీ కోసం ఏడాదికి కనీస ప్రీమియం  రూ. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌8,900 కే రూ.  లక్ష కవరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందిస్తోంది. గరిష్టంగా రూ.17,8‌‌‌‌00 కు మూడు లక్షల కవరేజ్ ఇస్తోంది. పాలసీ కాల పరిమితి గరిష్టంగా మూడేళ్ల వరకు ఉంది. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అమ్ముతున్న హెల్త్ పాలసీల్లో ఆరోగ్య ప్లస్ పాపులర్ అని సీఏ అంకిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెహతా అన్నారు.  ప్రీమియం తక్కువని, ఏజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా ఫ్లాట్ ప్రీమియంకే ఫ్యామిలీ మొత్తానికి కవరేజ్ అందిస్తోందని అన్నారు. ఈ పాలసీని ఏజెంట్లు, రిలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్లు అమ్మకుండా లేదా రెన్యువల్ చేయకుండా చూడడం రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విరుద్ధమని, నోటీస్ ఇవ్వకుండా పాలసీని విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా చేయడానికి వీలులేదని పేర్కొన్నారు. ఏదైనా పాలసీని విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకున్నా లేదా క్లోజ్ చేయాలనుకున్నా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా  నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పటికే కొన్న పాలసీ హోల్డర్లకు ఇన్సూరెన్స్ కంపెనీ 90 రోజుల టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఈ రెండింటిలో కూడా ఫెయిలైందని మెహతా అన్నారు. కానీ, కంపెనీ మాత్రం ఆరోగ్య ప్లస్ పాలసీ ఇంకా అందుబాటులో ఉందని పేర్కొంది.