దీర్ఘకాల పెట్టుబడులతోనే మేలు..సహనంతోనే సంపద సృష్టి..ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ రిపోర్ట్

దీర్ఘకాల పెట్టుబడులతోనే మేలు..సహనంతోనే సంపద సృష్టి..ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ రిపోర్ట్

హైదరాబాద్​, వెలుగు:  సరైన మ్యూచువల్ ఫండ్ లేదా పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోగానే లాభాలు రావని,   తదనంతరం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామనేదే కీలకమని ఎస్​బీఐ మ్యూచువల్​ ఫండ్స్ ​రిపోర్ట్ ​తెలిపింది. దీని ప్రకారం.. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో చూసి పెట్టుబడి పెట్టడం కంటే... దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగించడమే మంచిది. ఆదాయం పెరిగినప్పుడు దానికి అనుగుణంగా పెట్టుబడులను పెంచుకుంటూ పోవాలి.  ఏటా సిప్​ మొత్తాన్ని టాప్ అప్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుని నిలబడాలంటే అత్యవసర  నిధి తప్పనిసరి.  మార్కెట్లో అనిశ్చితి ఉన్నా సిప్​లను, ఫండ్స్‌‌ను మార్చకూడదు.