విద్యా సంస్థల్లో ఆత్మహత్యల నివారణకు మా గైడ్లైన్స్అమలు చేస్తున్నరా..? సుప్రీంకోర్టు

విద్యా సంస్థల్లో ఆత్మహత్యల నివారణకు మా గైడ్లైన్స్అమలు చేస్తున్నరా..? సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ఆత్మహత్యల నివారణకు తాము గతంలో ఇచ్చిన గైడ్​లైన్స్ అమలు ఎంతవరకు వచ్చిందో చెప్పాలని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను జస్టిస్​విక్రమ్​నాథ్, జస్టిస్​సందీప్​ మెహతాతో కూడిన బెంచ్ ఆదేశించింది. 8 వారాల్లోగా నివేదిక అందజేయాలని సోమవారం స్పష్టం చేసింది. ఎడ్యుకేషన్​ఇన్​స్టిట్యూట్స్‎లో స్టూడెంట్లు మానసిక సమస్యలతో సూసైడ్స్ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది.

2023లో ఆంధ్రప్రదేశ్‎లో జరిగిన బెంగాల్‎కు చెందిన నీట్​స్టూడెంట్(17) ఆత్మహత్య ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ అప్పట్లోనే ఏపీ హైకోర్టులో పిటిషన్​దాఖలైంది. ఈ ఘటనపై ఇటు ఏపీలో, అటు బెంగాల్‎లో కేసులు నమోదు కావడంతో.. సీబీఐకి అప్పగించే అంశం తమ పరిధిలోకి రాదని హైకోర్టు తేల్చిచెప్పింది. 

దీన్ని సవాల్​చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్​దాఖలు కాగా.. ఈ ఏడాది జులై 25న అత్యున్నత న్యాయస్థానం 15 గైడ్​లైన్స్‎తో కూడిన తీర్పు వెలువరించింది. కేసును సీబీఐకి అప్పగించింది. స్టూడెంట్ల సూసైడ్స్ నివారణకు దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం, ఫ్రేమ్​ వర్క్​ఉండాలని గైడ్​లైన్స్​లో పేర్కొంది. 

వంద మందికిపైగా స్టూడెంట్లు ఉన్న విద్యాసంస్థ తప్పనిసరిగా మానసిక కౌన్సెలర్లను నియమించుకోవాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్​ ఇవ్వాలని అందులో సూచించింది. ఇది స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్​సెంటర్లు, హాస్టళ్లు సహా అన్ని ఎడ్యుకేషన్​ఇన్‎స్టిట్యూట్లకు వర్తిస్తుందని తేల్చిచెప్పింది.