ప్లే బ్యాక్ ‌‌‌‌సింగర్ పేరుతో మోసాలు

ప్లే బ్యాక్ ‌‌‌‌సింగర్ పేరుతో మోసాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫేమస్ ప్లే బ్యాక్ తెలుగు సింగర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న యువకుడిని సైబరాబాద్ సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏసీపీ శ్రీనివాస్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపిన ప్రకారం.. అనంతపురం ప్రియాంక నగర్‌‌‌‌‌‌‌‌కి చెందిన అంకె చైతన్య కొంతకాలం కిందట సిటీకి వచ్చి ‘మస్తీ మ్యూజిక్‌‌‌‌’యూట్యూబ్‌‌‌‌ ఛానల్‌‌‌‌ పెట్టాడు. ఫేమస్ ‌‌‌ప్లే బ్యాక్ తెలుగు సింగర్ మేనేజర్‌‌‌‌‌‌‌‌నని ప్రచారం చేసుకుంటూ ఫేక్ ప్రొఫైల్స్‌‌‌‌ క్రియేట్ చేశాడు. సోషల్‌‌‌‌ మీడియాలో వ్యూవర్‌‌‌‌‌‌‌‌షిప్‌ సంపాదించాడు. గత ఫిబ్రవరి 20న ప్లే బ్యాక్ సింగర్‌‌‌‌‌‌‌‌ పేరుతో అనంతపురంలో ఈవెంట్‌‌‌‌, సామాజిక కార్యక్రమాల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేశాడు. బాధిత సింగర్‌‌‌‌‌‌‌‌ కంప్లయింట్ తో చైతన్యను అరెస్ట్ ‌‌‌చేసి రిమాండ్‌‌‌‌కి తరలించారు. ఇంతకుముందే అతనిపై కేసులు ఫైల్ అయి ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం..