సంక్రాంతి పండుగంటే చాలు ప్రంపంచంలో ఎక్కడ ఉన్నా... కుటుంబసభ్యులు .. దగ్గరి బంధువులందరూ కలిసి ఒక్కచోట చేరి సంబరాలు చేసుకుంటారు. ఇలా అందరూ ఒకే చోట చేరినప్పుడు ఇంట్లో అమ్మమ్మలు.. బామ్మలు వెరైటీ వంటకాలు ట్రై చేస్తారు. హెల్దీగా రుచిగా ఉండే సజ్జలతో బూరెలు.. లడ్డూలను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
సజ్జల బూరెలు తయారీకి కావలసినవి
- సజ్జలు - ఒక కిలో
- బెల్లం తురుము - అరకిలో
- నువ్వులు- పావు కప్పు
- ఇలాచీ పొడి- అర టీ స్పూన్
- ఎండు కొబ్బరి పొడి- పావు కప్పు
- సాబుదానా (సగ్గుబియ్యం) -ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు- తగినంత
- నెయ్యి లేదా నూనె - సరిపడా
సజ్జల బూరెలు తయారీ విధానం
సజ్జలు, సాబుదానా కలిపి మెత్తగా పిండి పట్టాలి. బెల్లం తురుమును నీళ్లలో కొద్ది సేపు నానబెట్టాలి తర్వాత సజ్జ పిండిలో ఈ బెల్లం నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. తరువాత దాంట్లో ఎండు కొబ్బరిపొడి, దోరగా వేయించిన నువ్వులు ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి.
►ALSO READ | సంక్రాంతి పండుగ.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల రూపంలో విష్ణుమూర్తి ఆశీర్వాదాలు..
ఆపైన పిండిని చిన్నచిన్న ఉండలుగా చేయాలి. వాటిని చేతుల్లోకి తీసుకుని బూరెలుగా వత్తాలి తర్వాత స్టన్లైన్లో నెయ్యి వేసి లేదా నూనె వేడి చేయాలి.
ఒకేసారి రెండు, మూడు బూరెలను డీప్ ఫ్రై చేసుకుంటే సరి పండుగ పూట సజ్జ బూరెలు తింటే స్పెషల్ గా ఉంటుంది
సజ్జ లడ్డూ తయారీకి కావలసినవి
- సజ్జపిండి- రెండు కప్పులు
- బెల్లం తురుము- ఒకటిన్నర కప్పు
- ఎండు కొబ్బరి తురుము - అర కప్పు
- ఇలాచీ పొడి - అర టీస్పూన్
- నెయ్యి సరిపడా
సజ్జ లడ్డూ తయారీ విధానం
సజ్జ పిండిని నెయ్యిలో దోరగా వేగించాలి. ఒక పెద్ద గిన్నెలో పిండి, బెల్లం తురుము, ఎండు కొబ్బర్ తురుము, ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి.
తర్వాత వేడిగా ఉన్న నెయ్యిని పిండిలో వేసి బాగా కలపాలి. కావాలంటే కొన్ని గోరువెచ్చని పాలు కూడా పోసుకోవచ్చు.
చివరగా పిండి ముద్దని చేతుల్లోకి తీసుకుని లడ్డూలు కట్టాలి. వీటిని నాలుగు గంటలు అరబెట్టి, తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకుంటే తాజాగా ఉంటాయి.. ఇవండీ సంక్రాంతి స్పెషల్స్
