Sankrati Breakfast special : సజ్జలతో దోశె.. ఇడ్లీ.. టైస్ట్ అండ్ హెల్దీ పుడ్.. ఇంటికొచ్చినవారు లొట్టలేస్తారు..!

Sankrati Breakfast special :  సజ్జలతో దోశె.. ఇడ్లీ.. టైస్ట్ అండ్ హెల్దీ పుడ్.. ఇంటికొచ్చినవారు లొట్టలేస్తారు..!

 సంక్రాంతి పండుగంటే  చాలు  ప్రంపంచంలో ఎక్కడ ఉన్నా... కుటుంబసభ్యులు .. దగ్గరి బంధువులందరూ కలిసి ఒక్కచోట చేరి  సంబరాలు చేసుకుంటారు.  ఇలా అందరూ ఒకే చోట చేరినప్పుడు ఇంట్లో అమ్మమ్మలు.. బామ్మలు  వెరైటీ వంటకాలు  ట్రై చేస్తారు.  హెల్దీగా రుచిగా ఉండే  సజ్జలతో తయారు చేసే బ్రేక్​ ఫాస్ట్​  స్పెషల్స్​ ను ఈ స్టోరీలో తెలుసుకుందాం. .  .!

సజ్జలతో దోశె తయారీకి కావలసినవి

 

  • సజ్జలు : ఒక కప్పు
  • మినప్పప్పు : అర కప్పు 
  • మెంతులు  : ఒక టీ స్పూన్ 
  • ఉప్పు  : తగినంత
  • నూనె : సరిపడ

సజ్జలతో దోశె తయారీ విధానం

ఒక గిన్నెలో మినప్పప్పు మెంతులు తగినన్ని నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టాలి. మరో గిన్నెలో సజ్జలు సరిపడా నీళ్లు పోసి అంతే సమయం నానబెట్టాలి. 

తర్వాత నానబెట్టిన మినప్పప్పు మెంతులను ఒకసారి, సజ్జలను ఒకసారి విడివిడిగా గ్రైండ్ చేయాలి. ఆ పిండిని రాత్రంతా నానబెట్టాలి. 

మరుసటిరోజు తెల్లారి ఆ పిండిలో కొద్దిగా ఉప్పు కలిపి పెనంలో దోశెలు పోయాలి. కొద్దికొద్దిగా నూనె చల్లుకుంటూ ఇరువైపులా కాల్చాలి.

 ఈ సజ్జ దోశెలను  ఆలూ కర్రీ లేదా పల్లీ చట్నీతో వర్స్ చేసుకుంటే రుచి అదిరిపోతుంది..

సజ్జల ఇడ్లీ తయారీకి కావాల్సినవి

  • సజ్జలు  :ఒక కప్పు
  • ఉప్పుడు బియ్యం (స్టీమ్ రైస్)  : ఒక కప్పు 
  • మినప్పప్పు  :అరకప్పు 
  • మెంతులు  : ఒక టీ స్పూన్

సజ్జల ఇడ్లీ తయారీ విధానం

ఒక పెద్దగిన్నెలో సజ్జలు, ఉప్పుడు బియ్యం, సరిపడా నీళ్లు పోసి ఏడు గంటలు నానబెట్టాలి. మరో గిన్నెలో మినప్పప్పు, మెంతులు, నీళ్లు పోసి అంతే సమయం నానబెట్టాలి.

 తర్వాత మిక్సీ లేదా గ్రైండర్​ లో  నానబెట్టిన సజ్జలు, బియ్యం, మెంతులు, మినప్పప్పు వేసి రుబ్బాలి. మిశ్రమం మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు కలపొచ్చు. అలాకాకుండా నానబెట్టుకున్న పదార్థాలను విడివిడిగాను గ్రైండ్ చేసుకోవచ్చు. 

►ALSO READ | Sankranti 2026: భోగి పండుగ జనవరి 14.. మళ్లీ 2040 దాకా ఇలాంటి రోజు రాదు..!

మెత్తగా రుబ్బుకున్న ఇడ్లీ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి మరో ఎనిమిది గంటలు నానబెట్టాలి. ఆపైన ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రల్లో పెట్టి అవిరిపై ఉడికించాలి.

 అంతే, ఎంతో రుచికరమైన ఇడ్లీ బ్రేక్​ ఫాస్ట్​ రెడీ.. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు ఇలాంటి వెరైటీ బ్రేక్​ ఫాస్ట్​తో సంక్రాంతి పండుగకు ఇంటికి  వచ్చిన  బంధువులతో లొట్టలేపిద్దామా  మరి..! 

–‌‌వెలుగు,లైఫ్​‌‌–